
27
జీవితంలో నెగ్గాలనుకుంటే
సాధనాలు రెండున్నాయి.
మరొకరి సొమ్ముని ఏవగించుకోవటం
మరొకరి భార్యను తలవకపోవటం.
దేవుడు నీకేది అనుగ్రహిస్తాడో
అదే నీ సమస్త సంపత్తి.
తుకా అంటున్నాడు: అప్పుడు నీ దేహమే
దేవుడి భాండాగారమవుతుంది.
साधनें तरी हीं च दोन्ही । जरी कोणी साधील ॥१॥
परद्रव्य परनारी । याचा धरीं विटाळ ॥ध्रु.॥
देवभाग्यें घरा येती । संपत्ती त्या सकळा ॥२॥
तुका म्हणे तें शरीर । गृह भांडार देवाचें ॥३॥ (575)
28
పతివ్రతకి భర్తే సర్వస్వమైనట్టు
మనకి నారాయణుడలా కావాలి.
లోభికి డబ్బే సర్వస్వమైనట్టు
మనకి నారాయణుడలా కావాలి.
తుకా అంటున్నాడు: నా మనసు ఏకవిధం.
విఠలుడు తప్ప నాకు మరొకరు తెలియరు.
पतिव्रते जैसा भ्रतार प्रमाण । आम्हां नारायण तैशापरी ॥१॥
सर्वभावें लोभ्या आवडे हें धन । आम्हां नारायण तैशापरी ॥२॥
तुका म्हणे एकविध जालें मन । विठ्ठला वांचून नेणे दुजें ॥३॥ (942)
29
నిజాయితీగా మాట్లాడితే చాలు
హరి ఖర్చులేకుండా చిక్కుతాడు
ఇంత సులువైన ఉపాయమున్నా
మనుషులు వట్టినే గడిపేస్తారు.
హృదయంలోంచి పలికే ఒక్క మాట
అదే గొప్ప పరోపకారం.
మనసులో మాలిన్యం తొలగిపోతే
అదే నిశ్చలత్వం అంటున్నాడు తుకా.
खरें बोले तरी । फुकासाठीं जोडे हरी ॥१॥
ऐसे फुकाचे उपाय । सांडूनियां वांयां जाय ॥ध्रु.॥
परउपकार । एका वचनाचा फार ॥२॥
तुका म्हणे मळ । मनें सांडितां शीतळ ॥३॥(1431)
30
కావటానికి వాళ్ళంతా గొప్ప తర్కవంతులు
కాని చివరికి విఠలుణ్ణి చేరుకోలేరు.
కావటానికి పుస్తకాలు మథించినవాళ్ళే
కానీ విఠలుడి వైభవం తెలుసుకోలేరు
తుకా అంటున్నాడు: సరళహృదయం వినా
మరే కొలమానంతోనూ దాన్ని కొలవలేవు.
उदंड शाहाणे होती तर्कवंत । परि नेणवे अंत विठोबाचा ॥१॥
उदंडा अक्षरां करोत भरोवरी । परि ते नेणेवेची थोरी विठोबाची ॥२॥
तुका म्हणे नाहीं भोळेपणा विण । जाणीव ते सिण रितें माप ॥३॥ (875)
3-4-2025

