
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా ఈ రోజు బైరాగి ‘ఆగమగీతి’ పైన ప్రసంగించాను. ‘చీకటి నీడలు’, ‘నూతిలో గొంతుకలు’ తర్వాత బైరాగి మూడవ కవితా సంపుటి ఆగమగీతి. ఆయన 1978 లో స్వర్గస్థులయ్యాక 1981 లో వెలువడిన కవితాసంపుటి ఇది. ఆయన రాసుకున్న కవితల్లో ప్రచురించబడ్డవేకాక, అముద్రితాలూ, అసంపూర్ణాలూ-మొత్తం మిగిలిన కవితలన్నీ ఇలా పుస్తక రూపంలో వెలువడటంతో బైరాగి మానసిక ప్రపంచంలోకి పాఠకుడు మరింత సన్నిహితంగా ప్రవేశించే వీలు కలిగింది. ఎనభైల ప్రారంభంలో ఈ సంపుటితో పాటు రేవతీదేవి ‘శిలాలోలిత’, అజంతా ‘కంప్యూటర్ చిత్రాలు’ కవితతో తెలుగు సాహిత్యంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ఆగమగీతిలో బైరాగి అన్వేషణని ప్రతిబింబించే కవితలతో పాటు ఆయన దర్శనంగా చెప్పదగ్గ ‘అరచిత కవిత’ ను కూడా ఈ ప్రసంగంలో వినిపించాను. మొత్తం ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
7-3-2025


అద్భుతం
ధన్యవాదాలు సార్