
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా 21-2-2025 న బైరాగి రాసిన కవిత అర్జున విషాదయోగం మీద ప్రసంగించాను. ఈ ప్రసంగంలో ముందు భగవద్గీత గురించి స్థూలంగా పరిచయం చేసి, అర్జునుడి పాత్ర ద్వారా కర్మక్షేత్రం మధ్యలో సంశయగ్రస్తుడయ్యే మానవుడి విచికిత్స గురించి బైరాగి ఏమని చెప్తున్నాడో వివరించాను. ఈ ప్రసంగంలో ప్రధానంగా మహాభారతం గురించీ, ఆ ఇతిహాసంలో భగవద్గీత స్థానం గురించీ స్థూలంగా వివరించేను. భగవద్గీతలో మూడు గీతలున్నాయని వ్యాఖ్యాతలు చెప్తుంటారు. కాని వాటిని వారు ఆరేసి అధ్యాయాలుగా గుర్తుపట్టే ప్రయత్నం చేసారు. అలాకాక గీతలో మూడు పొరలుగా ఇతిహాస సందేశం ఉందనీ, మొదటి పొరలో వర్ణాశ్రమ ధర్మాల గురించీ, రెండవ పొరలో స్వధర్మం గురించీ మాట్లాడితే, మూడవ పొరలో అన్ని ధర్మాల్నీ వదిలిపెట్టి సర్వేశ్వరుడికి శరణాగతి చెందడమొక్కటే మార్గమని చెప్తున్నదని వివరించేను
22-2-2025

