పుస్తక పరిచయం-55

నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన చేస్తున్న ప్రసంగాల్లో ఇది నాలుగవది. గత వారం లాంగ్ స్టన్ హ్యూస్ గురించి చేసిన చర్చను కొనసాగించడంతో పాటు, రిచర్డ్ రైట్, లొరైన్ హాన్స్ బెర్రీ, పాల్ రోబ్సన్ ల గురించి కూడా ఈ రోజు ప్రసంగించాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

కృష్ణప్రేమికుడు

ఆరేళ్ళ కిందట నేను ఆ నగరాన్ని మొదటిసారి చూసినప్పుడు ఆ ఆకాశం కింద ఏదో తెలియని ఆత్మీయత, ఆ కావేరీ గాలుల్లో ఏదో పూర్వజన్మల రక్తబంధస్పర్శ నన్ను తాకుతూనే ఉంది. కానీ, మన కాలంలో, తంజావురుతో ఇంతగా తాదాత్మ్యం చెందిన కవి మాత్రం ఇదుగో, ఈ వంశీకృష్ణనే అనడంలో సందేహం లేదు.