మేఘదూతం

నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు? అక్కడ సకలసంపదలమధ్య శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?

పుస్తకపరిచయం-36

పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది పదహారవది. ఈ రోజు ఉత్తరమేఘంలో 45 వ శ్లోకం నుండి 57 వ శ్లోకం వరకు ముచ్చటించాను. దీనితో మేఘసందేశం పైన ప్రసంగ పరంపర పూర్తయింది. ఈ ప్రయాణంలో మేఘంతో పాటు కలిసినడిచిన వారందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

నన్ను వెన్నాడే కథలు-11

ఇప్పటి యువతీయువకులూ, కవులూ, కథకులూ ఎంతమంది గోర్కీని చదువుతున్నారో తెలియదుగానీ, మా తరందాకా గోర్కీని చదవడం తప్పనిసరిగా ఉండేది. ఇంకా చెప్పాలంటే నువ్వొక సాహిత్యబృందంతో కలిసి తిరగాలంటే గోర్కీని చదివి ఉండటం ఒక అలిఖిత సభ్యత్వ నిబంధనలాగా ఉండేది.