ప్రభాతసంగీతం

ఆ గాయకులు తాము గానం చేసిన రెండున్నర గంటల పాటూ అక్కడ అటువంటి ఒక వేడుకనే నడిపారనిపించింది. మనం పండగల్లో మట్టితో దేవతను రూపొందిస్తే వారు మన చుట్టూ ఉన్న గాల్లోంచి సంగీతదేవతను ఆవాహన చేసారు.

వర్షోత్సవం

మన శ్రేష్ఠకళలన్నీ మనకి ఈ విద్యనేర్పడానికే విలసిల్లాయనిపిస్తున్నది. ఏ విద్య? నీ మనసుని లోపలకి తిప్పే విద్య. 'అరూపసాగరంలో మునిగిపోయే విద్య.' కనీసం రోజులో కొంతసేపేనా రూపారణ్యం నుంచి బయటపడేసే విద్య. ..

ఉన్నట్టుండి పూసిన పూలు

ఆర్చిస్ 300 జిఎస్ ఎం 10x 25 సెం.మీ వాటర్ కలర్ పాడ్ ఒకటి కొని చాలా రోజులయ్యింది. 20 షీట్ల పాడ్. ఈ సైజులో ఎటువంటి బొమ్మలు గీయవచ్చో తెలియక ఈ పాడ్ చాలారోజులు అలానే అట్టేపెట్టేసాను. ఇప్పుడు ఉన్నట్టుండి రెండు రోజులుగా ఈ పాడ్ కి పూలు పూస్తూ ఉన్నాయి. వాటిని మీకు చూపించకుండా ఎలా ఉంటాను!