ఆదిమరాసలేఖ

శ్రీరామనాథ్ మరింత ప్రత్యేకం. ఈయన కవి. ఆయన పద్యం రాసినా, మరొకరి పద్యం గురించి రాసినా, కేవలం వచనం రాసినా కూడా ఆ వాక్కు ఎంతో సంస్కారవంతంగానూ, ఎంతో వినయనమ్రంగానూ ఉంటుంది. అత్యంత ప్రౌఢ వాక్కు. ..

ఫలప్రదమైన అనునయం

ఈ మార్పుల వల్ల బైరాగి మూలకవితను మరింత ప్రభావశీలంగా, మరింత ఫలప్రదంగా తీర్చిదిద్దాడని చెప్పవచ్చు. వృత్తపద్యాల వల్ల, ఆ అపురూపమైన శయ్యవల్ల, తన వేడికోలులో ఒక అవిచ్ఛిన్నతను, తెంపులేనితనాన్ని, ఏకోన్ముఖతను ఆయన అనితరసాధ్యంగా తీసుకురాగలిగాడు.

నన్ను వెన్నాడే కథలు-7

ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు, కథకుడు వంశీ ఒకసారి నాతో మాటల మధ్య స్టాన్లీ కుబ్రిక్ గురించి ఒక మాట చెప్పారు. చాలామంది దర్శకులు ఇప్పటికీ తాము సినిమాలు తీయబోయేముందు స్ఫూర్తికోసం ఆయన సినిమాలు వేసుకుని చూస్తూ ఉంటారట. కథారచన వరకూ నేను ఈ మాట టాల్ స్టాయి గురించి చెప్పగలను.