ఉన్నట్టుండి పూసిన పూలు

ఆర్చిస్ 300 జిఎస్ ఎం 10x 25 సెం.మీ వాటర్ కలర్ పాడ్ ఒకటి కొని చాలా రోజులయ్యింది. 20 షీట్ల పాడ్. ఈ సైజులో ఎటువంటి బొమ్మలు గీయవచ్చో తెలియక ఈ పాడ్ చాలారోజులు అలానే అట్టేపెట్టేసాను. ఇప్పుడు ఉన్నట్టుండి రెండు రోజులుగా ఈ పాడ్ కి పూలు పూస్తూ ఉన్నాయి. వాటిని మీకు చూపించకుండా ఎలా ఉంటాను!

13-9-2025

15 Replies to “ఉన్నట్టుండి పూసిన పూలు”

  1. నాకు చిత్రకళ అంటే చాలా ఇష్టం. పైంటులు, బ్రష్షులు, కాన్వాస్లు అన్నీ కొనుక్కున్నా కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియక అలానే ఉంచా… మీ పూలు పరిమళాలు వెదజల్లుతున్నాయి.

  2. Very natural, so beautiful.
    Amazing work Sir…

    Thanks for sharing with us 🙏❤️🌹

  3. సాహిత్యం  తలుపు అంటే శీర్షిక .. ఏ ఇంటికి వెళ్లినా ప్రవేశ ద్వారం ఆ ఇంటి పట్ల వారు చూపిన శ్రద్ధ కనిపిస్తుంది .. అలాగే శీర్షిక దగ్గరే ఆ సంబంధిత ప్రక్రియ ఏదైనా  కాస్త అంచనా చూపుతుంది,.. చినవీరభద్రుడు గారి రచన ఏదైనా నా మటుకు నాకు ఎంతో ప్రత్యేకత..తప్పకుండా చదువుతాను.   హృదయాన్ని తాకే విధంగా రచించడం, భావాల్ని వ్యక్తీకరించడం ఎంతో ఆసక్తి గా ఉంటుంది ..  పూలు వాటి అందం, దానికి తగిన పేరు , లేదా పూసిన సమయాన్ని సంబంధించిన సమయం తాలూకు విషయాలు నిత్యం చూస్తున్న నాకు “ఉన్నట్లుండి పూసిన పూలు ” అంటే చాలా కొత్తగా అనిపించింది. ఎంతైనా మీరు ప్రత్యేకం సార్

    1. చాలా సంతోషం! కానీ ఈ శీర్షిక ఉన్నట్టుండి తట్టలేదు. ఈ ఊహకి చేరటానికి కొంత శ్రమ పడవలసి వచ్చింది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading