శరణార్థి

సమ్మెట ఉమాదేవి ఆదర్శ ఉపాధ్యాయులు. జీవితమంతా బడిపిల్లల్తో గడిపారు. ముఖ్యంగా మారుమూల గిరిజన తండాల్లో బాలబాలికలకి ఒక పూలతోవ చూపిస్తూ గడిపారు. ఫేస్ బుక్ లో తన వాల్ మీద నూరు కథల వరహాలు పేరిట తెలుగులో వచ్చిన కథల్లో తనకు నచ్చిన కథల్ని ఎంచుకుని తన గొంతులో మిత్రులకు వినిపిస్తూ ఉన్నారు. అందులో నూరవకథగా నా 'శరణార్థి' కథను వినిపించారు.