అదుగో, ఆ సంపుటాల్లో, మొదటి సంపుటంలోనే, శరత్ బాబు రాసిన 'మహేశం' కథ చదివాను. అప్పుడు నాకు బహుశా ఇరవై ఇరవయ్యొక్కేళ్ళ వయసు. ఆ కథ చదవగానే నిశ్చేష్టుణ్ణైపోయాను. ఆ శరత్ నాకు తెలిసిన శరత్ కాదు. నా పదహారేళ్ళ వయసునుంచీ నన్ను అలరిస్తూ, బుజ్జగిస్తూ, లాలిస్తూ వచ్చిన శరత్ కాదు. ..
