
గత ఆరేడేళ్ళుగా కథలమీదా, కథకులమీదా, నవలల మీదా నేను రాస్తూ వచ్చిన వ్యాసాల్ని కథల సముద్రం పేరిట సంకలనం చేసి ఈ-బుక్కుగా మీతో పంచుకున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఆ ఈ-బుక్కును ఎన్నెలపిట్ట ప్రచురణసంస్థ తరఫున శేషు కొర్లపాటి పుస్తకంగా తీసుకొచ్చేరు. ఈ రోజు బషీర్ బాగు ప్రెస్సు క్లబ్బులో జరిగిన రావిశాస్త్రి పురస్కార ప్రదాన సభలో ఈ పుస్తకాన్ని మహమ్మద్ ఖదీరు బాబు ఆవిష్కరించేరు. పుస్తకాన్ని డా.కొర్రపాటి ఆదిత్య అద్భుతంగా పరిచయం చేసారు.
ఈ పుస్తకం కావలసినవారు ennelapitta.com వారిని గాని లేదా 7989546568 వారిని గాని సంప్రదించవచ్చు. లేదా ఈ పుస్తకం ఆమెజాన్ ద్వారా లేదా pusthakam.in ద్వారా లేదా telugubooks.in ద్వారా గాని తెప్పించుకోవచ్చు.
పేజీలు.200, పుస్తకం ధర రు.250/
2-8-2025


శుభాభినందనలు భద్రుడు గారు. నాకు మీ ఈ-బుక్కులు ముద్రణ పొంది పుస్తక రూపం దాల్చడం మహదానందం గా అనిపిస్తుంది..
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!