
కృష్ణమాధవ్ తాడికొండ పాఠశాల విద్యార్థి. నాకు రెండేళ్ళు జూనియరు. ఇప్పుడు అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన మన వాసూకి మంచి మిత్రుడు కూడా. వాసు ద్వారా మళ్ళా మేము కలుసుకోగలిగాం. అతనితో పాటు తాడికొండలో చదువుకుని ఇప్పుడు అమెరికాలో ఉంటున్న కొందరు మిత్రులు నార్త్ కరోలినా రాష్ట్రంలోని గ్రేట్ స్మోకీ మౌంటెన్లలో ఈ మధ్య కలుసుకున్నారు. ఆ సందర్భంగా వారు తాడికొండలో గడిపిన రోజుల్ని తలుచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయుల్నీ, తమతో కలిసి చదువుకున్న మిత్రుల్నీ స్మరించుకున్నారు. ఆ సందర్భంగా నా ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ పుస్తకంలోంచి మొదటి భాగాన్ని చిన్ని వీడియోగా చేసి చూసుకున్నారు. ఆ కథనం వినగానే వారికి తాము ఆ స్కూల్లో చేరిన మొదటిరోజులు గుర్తొచ్చాయి. కొందరు ఎమోషనలు కూడా అయ్యారని విన్నాను. ఆ చిన్ని వీడియో నాకు పంపించారు. దాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
Featured image: Smoky Mountains, North Carolina, Pc: Wikipedia
4-7-2025


నమస్కారము. మునుపు చదివినా మళ్ళీ వింటుంటే అదే భావన. మీరు అలా నడిచిన దారుల వెలుతురు మాకు పంచుతున్నారు.
శుభోదయం. మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
మీ voice లో మీ బాల్యపు జ్ఞాపకాలు ఆ బొమ్మలలో చూస్తుంటే గతంలోకి వెళ్లి చూసొచ్చినట్లుగా వుంది.
చదువు కోసం పల్లె ను వదిలిన బాల్యమే నాది కూడా. Very relatable. బావుంది, sir!!
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
చదువు కోసం పల్లెను వదిలిన బాల్యపు జ్ఞాపకాలు ఎప్పుడూ వెంటాడుతుంటాయి. మీ కంఠం లో వినడం మా అదృష్టం. వీలైతే మీ చిన్ననాటి జ్ఞాపకాలను అట్లానే అనుభవాలను మీ స్వరంలో వినాలని నా కోరిక. ప్రార్థన.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
జిడ్డు కృష్ణమూర్తి గారి బాల్యం, సోదరుడు నిత్యానందు లతో కలిసి వున్న ఆ బాల్యం, తల్లి లేని, ఒక తెలియని దుఖం, ఇవి కృష్ణమూర్తి బయోగ్రఫీ చదినపుడు, బెంగ కలిగింది, అలాగే కొన్ని కలలు మెలకువలు కూడా 9ఏళ్ళ పిల్లాడి మీదనే నా ఆలోచనలు వుండిపోయాయి. బాల్యం తల్లి ఒడిలో నే జరగాలనే ది నా నమ్మకం.
ధన్యవాదాలు మేడం