అంటున్నాడు తుకా-13

నాట్యమూ, గానమూ నా శరణాలయాలు వాటిద్వారానే నేన్నిన్ను సేవించుకుంటాను. నీ నిద్రకు వేళైనప్పుడు సెలవు తీసుకుంటాను నువ్వు దిగివస్తే నా జీవితాన్నే హారతిస్తాను

సృష్టిగర్భ: ఉపనిషత్కాంతి

దీర్ఘాసి విజయభాస్కర్‌ కవిగా, రచయితగా, నాటకకర్తగా, సమర్థుడైన అధికారిగా ఇప్పటికే తెలుగుప్రపంచానికి పరిచయం. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఆయన ఈ స్థితికి చేరుకోవడమే ఒక జయగాథ, అతడు పుట్టిపెరిగిన ప్రాంతానికీ, ఆ కుటుంబాలకీ మాత్రమే కాదు, మనందరికీ కూడా. కానీ అతడు ఇంతదాకా అధిరోహించిన ఎత్తులు ఒక ఎత్తు. ఈ పుస్తకం ద్వారా చేపట్టిన ఆరోహణ మరొక ఎత్తు.

తీరనిదాహం

అందులో భాగంగా 2019 నుంచి ఇప్పటిదాకా కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఈ సంపుటిగా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.