
అందరు పిల్లల్లానే నేను కూడా పుట్టడం చిత్రకారుడిగానే పుట్టాను. కాని చదువూ, ఉద్యోగమూ నన్ను చిత్రలేఖనం నుంచి దూరంగా తీసుకుపోయాయి. తిరిగి మళ్ళా నలభయ్యేళ్ళు దాటాక 2005 లో మా తల్లితండ్రులిద్దరూ ఒక్కసారే ఈ లోకం వదిలి వెళ్ళిపోయినప్పుడు చిత్రలేఖనమే నన్ను అక్కున చేర్చుకుంది.
ఈ ఇరవయ్యేళ్ళుగా చిత్రలేఖనం గురించి చాలా చదివాను. రోజులకు రోజులు చిత్రకళాసాధనలోనే గడిపాను. సాహిత్యం కన్నా కూడా చిత్రలేఖనానికే ఎక్కువ సమయం కేటాయించానని కూడా చెప్పాలి. మరీ ముఖ్యంగా గత పదిపన్నెండేళ్ళుగా చిత్రకారుల్నీ, శిల్పుల్నీ, వివిధ చిత్రకళారీతుల్నీ అర్థం చేసుకోడంలో నాకు కలుగుతూ వస్తున్న ఆలోచనల్ని ఫేస్‌బుక్ ద్వారానూ, నా బ్లాగు ద్వారానూ మిత్రుల్తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చాను.
అలా పంచుకున్న 58 వ్యాసాల సంపుటి ఈ పుస్తకం ‘తూలిక’. ఈ రంగుల పండగ సందర్భంగా దీన్ని మీతో పంచుకుంటున్నాను.
చిన్నప్పుడు ఇంటికి దూరంగా తాడికొండ హాస్టల్లో ఉన్నరోజుల్లో నాకు తల్లీతండ్రీ తానే అయి నన్ను చేరదీసిన మా ఆర్టు మాష్టారు వారణాసి రామ్మూర్తిగారి దివ్యస్మృతికి ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్నాను.
ఇది నా 58 వ పుస్తకం.
దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో పంచుకోవచ్చు.
మీరు ఈ పుస్తకం పేజీలు తిప్పుతూ చదవాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు.
13-3-2025


అమోఘం…వర్ణచిత్రాలను హోలీ రోజున విడుదల చేయడం.
మీ వేగం అనితర సాధ్యం. మీరు దయతో పంచుతున్న పుస్తకాల చదివేలోపే మరోటి ఇస్తున్నారు. అపారకరుణా వృష్టి.
నా రోజులో పఠనంలో సగభాగం మీ రచనలే కావడం యాదృఛ్ఛికమే ఐనా అంత సారవంతం కావడం మీ ప్రతిభయే. నమస్సులు మీకు.
హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.
చిత్రకళ తాదాత్మ్యతను ఇచ్చి చింతను దూరం చేస్తుంది. మీ బహుముఖ ప్రజ్ఞాశాలిత్వంలో చిత్రకళ ను భాగం చేసుకుని మమ్మల్ని ధన్యుల్ని చేశారు. ఈ విషయం మీద ఒక అమూల్యమైన పుస్తకం తెస్తున్నందుకు మీకు అభినందనలు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను సర్ . అభినందనలు.
ధన్యవాదాలు సార్
అద్భుతమైన పుస్తకం. ఇది ప్రతిదినం కొంచెం కొంచెంగా చదువుతూ ఆస్వాదించాల్సిన విషయం . చిత్రకళ అంటే ఏమిటో తెలియాలంటే దీనిని చదవాలి. చాలా తెలియని విషయాలు ఎంతో విడమరిచి చెప్పారు. ఇది print లో దొరుకుతుందా ?
ధన్యవాదాలు సార్! ఇది ప్రింట్ చేయలేదు. కేవలం పిడిఎఫ్ గా మాత్రమే అందుబాటులో ఉంచగలిగాను.