కార్తిక ప్రభాతాల్లో నదీస్నానంకోసం కొందరు సంవత్సరమంతా ప్రతీక్షించినట్టు మాఘమాసపు సాయంకాలాల గాలులకోసం నేను ఏడాదిపొడుగునా ఎదురుచూస్తాను.
అంటున్నాడు తుకా-3
సకలజనుల చరణాలమీద తలవాల్చి విన్నవించుకుంటున్నాను. వక్తలుగానీ, శ్రోతలుగానీ నిజమెంతో మీరే పరీక్షించి చూసుకోండి.
యావత్ప్రపంచపు ఆస్తి
ఆ మొదటి ప్రపంచానికీ ఈ రెండో ప్రపంచానికీ పోలికనే లేదు. మొదటి రెండు హాళ్ళల్లోనూ నడుస్తున్నంతసేపూ గంభీరమైన పద్యాలు వింటున్నట్టుంది. కాని ఈ హాల్లో తిరుగుతున్నప్పుడు తెలంగాణా పల్లెపాట వింటున్నట్టుంది.
