ఆ నాటి నావోడు సెందురూడా

మరీ ముఖ్యం, దేశదేశాల కవిత్వం నాకు పరిచయమైన తర్వాత, ఎంకి పాటలు తెలుగు సాహిత్యానికి ఎంత అపురూపమైన కానుకనో అర్థమవుతూ ఉంది. ఆ పాటలు కాదు, ఆ పాటల వెనక ఉన్న 'మాటలనియెడు మంత్రమహిమ 'గోచరిస్తూ ఉంది.

అవధూత గీత

కిందటి అక్టోబరు-నవంబరు నెలల్లో అవధూత గీతకు నా తెలుగు అనువాదాన్నీ, ఆ గీతను ఉపదేశించిన దత్తాత్రేయుల దర్శనం పైన కొన్ని ఆలోచనల్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అనువాదాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను. ఈ అనువాదాన్ని గాణ్గాపురంలోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి నిర్గుణపాదుకలముందు సమర్పిస్తున్నాను. ఇది నా 57 వ పుస్తకం.

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం

నాకు ఆ క్షణాన నా చిన్నప్పుడు మా ఊళ్ళో కుమ్మరులుండే వీథి గుర్తొచ్చింది. రెండుమూడు కుటుంబాలే ఉండేవారుగాని, ఆ ఇళ్ళన్నీ ఒకదానికొకటి గొలుసుకట్టుగా ఉండేవి. ఆ ఇళ్ళకు ఒక పక్కగా ఆవం. అందులోంచి ఎప్పుడూ ఆరని పొగ. కొత్తగా చేసిన కుండలు, కాల్చిన కుండలు, పగిలిన కుండలు, గాలికి రేగే ఊక నుసి- ఆ ప్రాంతమంతా ఒక కార్ఖానా లాగా ఉండేది. నా జీవితంలో నేను చూసిన మొదటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది.