దు-ఫు పేరు మీద లభ్యమవుతున్న దాదాపు పధ్నాలుగు వందల కవితల్లోంచి శ్రీనివాస్ గౌడ్ ఎంపిక చేసి, అనువదించిన ఈ నలభై కవితలూ దు-ఫు జీవించిన కాలాన్నీ, సుఖదుఃఖాల్నీ తెలుగుపాఠకులకు కొంతేనా పరిచయం చెయ్యగలవు. ఈ చిన్నపుస్తకంతో దు-ఫు తెలుగుహృదయాల్లోకి చొరబడగలడని నమ్మవచ్చు.
పుస్తక పరిచయం-1
మొన్న ఈ-బుక్ గా విడుదల చేసిన 'ప్రేమగోష్ఠి 'పుస్తకాన్ని పరిచయం చేస్తూ నిన్న పేస్ బుక్ లైవ్ లో ఒక ప్రసంగం చేశాను. మిత్రులు చాలామంది ఆ ప్రసంగం విన్నారు. ఆ ప్రసంగం వినలేకపోయినవారి కోసం దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఇదుగో ఇలా మీతో పంచుకుంటున్నాను.
ప్రేమగోష్ఠి
ఈ 'ప్రేమగోష్ఠి' నా 52 వ పుస్తకం. ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొదలవుతున్న సందర్భంగా ఆ అనువాదాన్నిలా ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఆ సంభాషణ నేపథ్యాన్ని, తాత్త్విక ప్రాసంగికతని వివరిస్తూ నేను రాసిన ఒక సుదీర్ఘ పరిచయ వ్యాసం కూడా ఉంది. దీన్ని మిత్రులు కల్యాణి నీలారంభంగారికి అంకితమిస్తున్నాను. ఆమె తానున్నచోటునే ఒక ఏథెన్సుగా మార్చగల విద్వన్మణి.
