తిరుపాలమ్మ

ఎం.ప్రగతి గారు హిందూపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రినిసిపాలుగా పనిచేస్తున్నారు. ఆమె రాసిన ఈ తిరుపాలమ్మ కథ పత్రికలో వచ్చినప్పుడే చదివాను. ఈ కథ 2023 లోనే వచ్చినా ఏ వార్షిక సంకలనాల్లోగాని, ఏ ప్రత్యేక కథా సంకలనాల్లోగాని మీరు చూసేరా? ఇంతకన్నా ముఖ్యమైన సామాజిక సమస్య మరేముంటుంది గనుక ఒక కథకుడు కథగా మలచడానికి?