శర్మగారు అప్పుడూ, ఇప్పుడూ కూడా ఒక నిండుగోదావరిని తనలో నింపిపెట్టుకుని ఉన్నారు. ఆయన మా ఇంట్లో కూచుని మాటాడుతున్నంతసేపూ ఆ గోదావరి తొణుకుతూనే ఉంది. చప్పుడు చేస్తూనే ఉంది. ఆయన కూచున్నంతసేపూ నాకు గోదావరి ఒడ్డున కూచున్నట్టే ఉంది. మళ్ళా శరభయ్యగారి సన్నిధిలో కవిత్వం గురించి మాటాడుకున్నట్టే ఉంది.
