టాగోర్ శాంతినికేతనం స్థాపించినప్పుడు ఆ భవనం మీద 'యత్ర విశ్వం భవతి ఏక నీడమ్' అని రాసిపెట్టుకున్నాడు. అంటే ఎక్కడ సమస్త విశ్వమూ ఒక గూడుగా మారుతుందో అటువంటి చోటు కావాలి తన పాఠశాల అని అనుకున్నాడాయన. తుమ్మపూడిలో సంజీవ దేవ్ గారింట్లో నాకు ఆ వాక్యమే పదే పదే గుర్తొస్తూ ఉంది. అక్కడ సమస్త విశ్వమూ ఒక కులాయంగా మారింది.
