పొద్దున్నే నగరాన్ని నిద్రలేపుతున్నాయి ప్రార్థనలు కాని దేవుడి దృష్టి కోకిల పిలుపుల మీద ఉంది.
తాళ్లు కట్టి మరీ
తాళ్లు కట్టి మరీ ఈ నగరాన్ని మేఘాలు ఎక్కడికో తరలించుకుపోతున్నవి. ..
తలుపులు మూసేసినట్టు
తలుపులు మూసేసినట్టు నింగి పొడుగునా మబ్బు మళ్లీ ఇంతలోనే బార్లా తెరుచుకుంటున్న తలుపులు. ..
