పాడకుండా ఉండలేని పాట

ఒక రాత్రి నామదేవుడితో కలిసి పాండురంగడు తుకారాం కలలో అడుగు పెట్టాడు. అతడి ముందు తక్కెడ చాపాడు. ఒకవైపు సిబ్బెలో నామదేవుడు కోటి కీర్తనలు పోగు పోశాడు.

నూరు శరత్తులు జీవించండి

ముకుంద రామారావు గారికి అజో-విభొ-కందాళం సంస్థ వారు, 2024 కు గాను జీవితకాల సాధన పురస్కారం అందించారని తెలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. గొంతు ముప్ఫై ఏళ్లుగా ఆయన కవిగా, అనువాదకుడిగా, ప్రపంచ సాహిత్య పరిచయకర్తగా తెలుగు సాహిత్యంలో చేస్తూ వచ్చిన కృషి అద్వితీయం.