పాల్ ఎలార్డ్

కాని ఎలార్డ్ కవిత్వంలో ఎక్కడా రూపకాలంకారాలకోసం వెతుకులాట కనిపించదు. అది మామూలు భాష, మామూలు మాటలు, అత్యంత స్వభావోక్తి. కాని ఒక మాట నేరుగా హృదయం నుంచి వెలువడినప్పుడు దానికదే గొప్ప కవిత్వం కాగలదని ఈ సంపుటంలోని కవితలన్నీ ఋజువుచేస్తున్నాయి.