
నా కథా సంపుటి మార్చిలో ఆవిష్కరించినప్పుడు పుస్తక ప్రచురణకర్తా, నా మిత్రుడూ ఎమెస్కోవిజయ్ కుమార్ ఆరోజు వచ్చిన మిత్రులందరికీ దాదాపు రెండువందల కాపీలదాకాఉచితంగా పంచిపెట్టాడు. కానీ ఆ మిత్రుల్లో ఒకరిద్దరు తప్ప మరెవరూ ఆ పుస్తకం చదివినట్టు లేదు.
ఆ రోజు సమావేశానికి రాకపోయినా కస్తూరి మురళి కృష్ణ గారు ఈ పుస్తకం కొనుక్కుని మరీ సవివరమైన సమీక్ష రాశారు. కథల పైన ఆయన అభిప్రాయాలన్నిటితోనూ నేను అంగీకరించినా, అంగీకరించకపోయినా, అన్నిటికన్నా ముందు, ఆయన ఈ కథలు ఇంత లోతుగా చదవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.
‘ముత్యపు చిప్ప కోసం ఎదురుచూస్తున్న వాన చినుకు ఈ కథా సంపుటి’ అని రాశారాయన. ఈ సమీక్ష చదివాక ఆయన హృదయం కూడా ముత్యపు చిప్పనే అనిపించింది. మీరు కూడా చదవాలనుకుంటే ఈ లంకె నొక్కి చదవవచ్చు.
https://sanchika.com/vadrevu-chinaveerabhadrudu-kathalu-1980-2023-book-review/
19-12-2023


మంచి పుస్తకానికి గొప్ప సమీక్ష.సమీక్షకోసం కస్తూరి మురళీకృష్ణ గారు ఎంత లోతుగా అధ్యయనా త్మకంగా కథలను చదివారో తెలుస్తుంది. మరొక రకంగా కథలను ఎలా చదవాలో విశ్లేషించాలో కూడా సూచించినట్లుంది.అభినందనలిరువురికీ
ధన్యవాదాలు సార్
అనిపించిన విషయాన్ని నిక్కచ్చిగా చెప్పెతత్వం ఈ విమర్శకుడిది. బాగుంది విశ్లేషణ సర్.
ధన్యవాదాలు సార్