నీ ఇంద్రియాలూ, చైతన్యమూ, అనుభూతీ మేల్కొంటున్నాయని తెలిసాక, నువ్వు ప్రయాణం కొనసాగించవలసిందే, ఆపడానికి నీకు నైతికమైన హక్కులేదు. నీతో కలిసి నడవగలిగినవాళ్ళు నడవగలిగినంత దూరం నడుస్తారు. వాళ్ళు ఆగిపోవచ్చు, కానీ కాలాంతరంలో మరెవరో మరెక్కడో నిన్ను చూసి తమ ప్రయాణానికి ధైర్యం తెచ్చుకుంటారు.
