పోస్టు చేసిన ఉత్తరాలు-5

ప్రతి ప్రేమికుడికీ, ప్రేమికురాలికీ ప్లేటో చెప్పినట్టుగా ఒక ఆదర్శమూర్తి మనసులో ఉంటారు. కాని ఆ ఆదర్శమూర్తి పోలికలు అంత స్పష్టంగా గుర్తుపట్టేట్టు ఉండవు. అది చిన్నప్పుడు తప్పిపోయిన మిత్రుడి ఫొటో లాంటింది. ఇక ప్రేమికులు ఎవరిని కలిసినా, ఎవరితో ప్రేమలో పడ్డా, మాటిమాటికీ ఆ ఫొటో తీసి చూసుకుంటూ, ఇతడే కదా, ఈమే కదా అనుకుంటూ ఉంటారు.