ప్రేమగోష్ఠి-4

కాబట్టి ఏ విధంగా చూసినా, శీలసముపార్జనకోసమో, విలువలకోసమో ఒకరు మరొకరి ప్రేమను అంగీకరించడం అన్నివిధాలా ఉదాత్తమైందే అవుతుంది.  ఇటువంటి ప్రేమనే ద్యులోకప్రేమ అనిపించుకుంటుంది. అటువంటి ప్రేమ స్వర్గంతో సమానం. తమ అభ్యున్నతికోరుకునే కోసం ప్రేమికుల్నీ, వారు ప్రేమించేవారినీ కూడా ఉత్సుకుల్ని చెయ్యగల ఇటువంటి ప్రేమ కన్నా వ్యక్తులకీ, నగరాలకూ అమూల్యమైంది మరొకటి ఉండబోదు.