అక్కడ పూర్తిగా శిథిలమైపోగా మిగిలిన ఒక ఏనుగు ముఖాకృతిలో ఉండే స్తంభాన్ని గియ్యబోతే, ఆ ఏనుగూ, దాని కుంభస్థలమూ, ఆ నేత్రమూ, ఆ దంతమూ- కొన్ని శతాబ్దాల కిందట ఆ శిల్పి వాటిని తీర్చిదిద్దినప్పుడు, అతడి వేళ్ళకి ఏ సౌకుమార్యం అనుభూతికి వచ్చి ఉంటుందో అది మళ్ళా నా వేళ్ళకి కూడా అందినట్టనిపించింది.
