పునర్యానం- 30 & 31

ఏముంది అక్కడ? అన్ని గిరిజన గ్రామాల్లో ఏముందో అక్కడా అదే ఉంది. ఏమి లేదక్కడ ? ప్రతి ఒక్క గిరిజన గ్రామంలోనూ ఏది లేదో అక్కడా అదే లేదు. అయినా అక్కడ ఒక ఇంటి అరుగు మీద కూర్చుని తుపాకుల గూడెం చూశాను అని నాకు నేను చెప్పుకున్నాను.