పునర్యానం-23

చరిత్ర, తిరుగుబాట్లు, సాహిత్యం పక్కనపెట్టి చూసినా, భూషణం గారు గొప్ప ప్రేమైక మానవుడు. అటువంటి మనిషిని మనం ఒక్కసారి కలుసుకున్నా మన హృదయాల మీద అతని ముద్ర పచ్చబొట్టు పొడిచినట్టుగా దిగబడిపోతుంది.