ఆ తర్వాత మూడేళ్ళ పాటు నా రాజమండ్రి జీవితాన్ని ఆ పుస్తకం వెలిగించింది. ఒక మనిషికి ఒక పుస్తకం తోడుగా ఉండటమనేది సాధారణంగా మనం మతగ్రంథాల విషయంలోనే చూస్తాం. కాని అరుదుగా సాహిత్య గ్రంథాలు కూడా అటువంటి చోటు సంపాదించుకోగలవని ఆగమగీతి నా జీవితంలో ప్రవేశించాకే అర్థమయింది.
