పునర్యానం-13

నిజానికి ఈ వేదన రామాయణ వేదన కూడా. అంత దీర్ఘ యానంతర్వాత, సంపూర్ణశత్రుసంహారం తర్వాత చివరికి రాముడు అనుకున్నదేమిటి? కన్నతల్లీ,  సొంత ఊరూ స్వర్గం కన్నా గొప్పవనే కదా!