ఆషాఢమేఘం-25

స్వర్ణకారుడు చిన్న చిన్నబంగారు తునకల్తో ఆభరణాలు తయారుచేసినట్టు అమరుకుడు చిన్న చిన్నమాటల్తో, సున్నితమైన ఊహల్తో తన ముక్తకాల్ని తీర్చిదిద్దాడు. ఆ పద్యాలది లోగొంతుక. బిగ్గరగా అరిచే కవులు, బిగ్గరగా అరిస్తే తప్ప కవిత్వం కాదనుకునే శ్రోతలూ అమరుకకావ్యాన్ని ఆనందించలేరు.