కేవలం 'ఉండటం' దాస్యం. 'జీవించడం' స్వాతంత్య్రం. 'ఉండటం' స్తబ్ధత. 'జీవించడం' చలనం. 'ఉండటం' జడత్వం. 'జీవించడం' స్పందన. ఏది కేవలం 'ఉంటుందో' అది ముడుచుకున్న జీవితం. ఏది 'జీవిస్తుందో' అది తెరుచుకున్న జీవితం.
మా నాన్న ఇక లేడు
నిన్న అర్థరాత్రి పార్వతి గారినుంచి మెసేజి. 'మా నాన్న ఇక లేడు' అని.
మూడో ఒట్టు
ఆ కథ చివరికి వచ్చేటప్పటికి, బండివాడు హీరామన్ మూడో ఒట్టు పెట్టుకోక తప్పలేదు. బోనులో ఉన్న పులిని కూడా ఒక సర్కస్ కంపెనీ కోసం కిరాయి తోలిన హీరామన్ ఈసారి మళ్ళా ఎప్పుడూ ఆడవాళ్ళను బండిలో ఎక్కించుకోకూడదని ఒట్టు పెట్టుకున్నాడు!
