మీ యాభయ్యవ పుస్తకం ప్రత్యేకంగా ఉండబోతోంది కదా అనడిగారు ఒక మిత్రురాలు. అవునన్నాను. ఏమిటా పుస్తకం అనడిగారు. చెప్పలేదు. చెప్పకూడదని కాదు. చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే నేననుకున్నట్టుగా ఆ పుస్తకం తేగలనా అన్న ఆందోళన నా మనసుని అంటిపెట్టుకునే ఉందిన్నాళ్ళూ. ఏమైతేనేం, భగవంతుడి దయ వల్ల, ఇదుగో, ఈ 'మూడువందల వచనాలు' నిన్ననే శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల చరణాల దగ్గర సమర్పించగలిగాను. ఈ పుస్తకం ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.
ఈశ్వర స్తుతిగీతాలు
మొత్తం అరవై నాలుగు గీతాలకు తెలుగు అనువాదాల్నీ, విపులమైన ఒక పరిచయ వ్యాసంతో కలిపి ఇప్పుడు ఈశ్వర స్తుతిగీతాలు పేరిట ఇదుగో ఇలా మీకు అందిస్తున్నాను. ఇది నా 48 వ పుస్తకం.
సాహిత్యం గొప్ప ఆశ్రయం
కాని ఏళ్ళ మీదట, సోక్రటీస్ నీ, ప్లేటోనీ చదివాక, శ్రోతల్ని రంజింపచెయ్యడంకన్నా, శ్రోతలు మెచ్చకపోయినా సత్యం మాట్లాడటమే నిజమైన వక్తకి ముఖ్యం కావాలని తెలుసుకున్నాను.
