తూలిక

గత పదిపన్నెండేళ్ళుగా చిత్రకారుల్నీ, శిల్పుల్నీ, వివిధ చిత్రకళారీతుల్నీ అర్థం చేసుకోడంలో నాకు కలుగుతూ వస్తున్న ఆలోచనల్ని ఫేస్‌బుక్‌ ద్వారానూ, నా బ్లాగు ద్వారానూ మిత్రుల్తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచ్చాను. అలా పంచుకున్న 58 వ్యాసాల సంపుటి ఈ పుస్తకం 'తూలిక'. ఈ రంగుల పండగ సందర్బంగా దీన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది నా 58 వ పుస్తకం. దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో పంచుకోవచ్చు.

యు ఆర్ యునీక్

అన్నిటికన్నా నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, డా.కలాం తన జీవితంలో చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తడం. ఆయన కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడేడు, పంపిణీ గురించి పట్టించుకోలేదు అనేవారికి ఈ పుస్తకం ఒక సమాధానం.