నన్ను వెన్నాడే కథలు-10

ఆయన రాసిన కథ 'ఆంజనేయస్వామివారు.' మరాఠీ కథాసంగ్రాహంలోని ఈ కథ నలభయ్యేళ్ళ కిందట మొదటిసారి చదివినప్పుడు నాకు ఎంత కొత్తగా అనిపించిందో, ఇప్పుడూ, అంతే తాజాగా ఉంది.

బన గర్ వాడి

ఇన్నాళ్ళకు మరొకసారి బనగర్ వాడి చదివాను. దాదాపు నలభై అయిదేళ్ళ తరువాత. ఆ పసిప్రాయంలో నన్నంతగా లోబరుచుకున్న ఆ ప్రాశస్త్యం ఆ నవలదా లేక అప్పటి నా నిష్కళంక హృదయానిదా లేక తాడికొండ పాఠశాలదా అని పరిశీలనగా చదివాను. అదంతా ఆ కథలోని నైర్మల్యమని నాకిప్పుడు బోధపడింది.