ఊర్ణనాభి

విశ్వనాథ ఈ అర్థాన్ని మరింత వివరంగా 'నీవ నిర్మించుకొందువు నిన్ను కట్టు త్రాళ్ళ వానిని కర్మసూత్రములన్ తెంపు' అన్నాడు. 'నీవ' అనే మాట గమనించదగ్గది. నీవ అంటే 'నువ్వు మాత్రమే' అని.

ఒక జీవుడి ఇష్టం

గురజాడ, గాంధీ, విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.

అల నన్నయకు లేదు

నూటొక్క డిగ్రీల వైరల్ జ్వరంతో మంచం మీద పడి కునారిల్లుతున్న నాకు ఒక జిజ్ఞాసువునుంచి రెండు మిస్డ్ కాల్స్. ఏమిటని పలకరిస్తే 'ఒక పద్యం రిఫరెన్సు కావాలి మాష్టారూ, విశ్వనాథ వారి పద్యం 'అల నన్నయకు లేదు, తిక్కనకు లేదా భోగము..'అనే పద్యం ఎక్కడిదో చెప్తారా' అని.