కావ్యానందంలో ఇది కూడా భాగమే. దేశకాలాల పరిమితుల్ని దాటి ప్రపంచమంతా కవుల హృదయాలు ఎక్కడెక్కడ ఒక్కలాగా స్పందించాయో ఆ తావుల్ని పట్టుకోవడం. ఏమీ తోచనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అక్కడికి పోయి కొంతసేపు గడిపి వస్తూండటం. ..
సాత్త్వికీకరణ వాచకం
ఆమెలో ఉన్న సంస్కారానికి ఆమె పాండిత్యం, ఆమె అధ్యయనం మరింత మెరుగుపెట్టాయి. ఆమె ముందే సాత్త్వికురాలు, సాహిత్యం ఆమెని మరింత సాత్త్వికీకరించింది. ఇక ఆమె ఎవరితో మాట్లాడినా, ఏమి మాట్లాడినా ఆ సాత్త్వికసుగంధం పొంగిపొర్లకుండా ఎలా ఉంటుంది?
బసవ పురాణం-1
ముగ్ధభక్తి అనేది పాల్కురికి సోమన భారతీయ భక్తి సాహిత్యానికి అందించిన ఉపాదానంగా మనం చెప్పవచ్చు. అటువంటి ముక్త భక్తుల కథల్లో రుద్ర పశుపతి అనే భక్తుడి కథ ఈరోజు మనం విందాం.
