నరకాగ్నికి సెలవు

అవును. నరకాన్ని కూడా ధిక్కరించగలవి పువ్వులు మాత్రమే. వాటికి తెలుసు, జీవించేది ఒక్కరోజు మాత్రమే. వాటికి మృత్యుభయం లేదు. రేపెలా గడుస్తుందన్న చింతలేదు. ఈ సాయంకాలానికి వాడి నేలరాలిపోతామన్న దిగులు లేదు. వాటికి తెలిసింది ఒక్కటే, ఆ క్షణం, తాము విప్పారుతాయే, ఆ క్షణం, తమ సమస్త అస్తిత్వంతో, ఆనందంతో, లోపల్నుంచీ ఉబికి వచ్చే ధగధగతో, పూర్తిగా, పరవశంతో, అజేయమైన ఆత్మబలంతో, తాము తాముగా పూర్తిగా విప్పారడం. అలా విప్పారిన క్షణం అవి భూమ్మీద స్వర్గాన్ని వికసింపచేస్తాయి. ఆ తర్వాత అవి ఉంటే ఏమిటి? రాలిపోతే ఏమిటి? కనీసం ఆ క్షణం, ఆ ఒక్క క్షణం, నరకలోకం తలుపులు మూసుకుపోతాయి.

ఆషాఢ మేఘం-20

పూర్వమేఘంలోని ఈ నలభై-యాభై పద్యాల్లో కాళిదాసు సంస్కృతకవిత్వాన్ని మొదటిసారిగా పొలాలమ్మట తిప్పాడు, అడవుల్లో, కొండల్లో విహరింపచేసాడు. గ్రామాల్లో రైతుల్ని, పథికవనితల్నీ పరిచయం చేసాడు.

ఏనీడ్ -2

ఎందుకంటే ఏనీడ్ లో కథానాయకుడు తన ప్రయాణంలో భాగంగా నరకలోకానికి కూడా వెళ్తాడు. నరకం ఎలా ఉంటుందో వర్జిల్ కి తెలుసు. నరకం గురించి హోమర్ కి కూడా తెలుసు. ఓడెస్సీలో ఒడెస్యూస్ కూడా నరకంలో అడుగుపెడతాడు. కాని హోమర్ చూసిన నరకం వేరు. వర్జిల్ చూసిన నరకం వేరు.