నినాదాలు, ప్రచారాలు, అనుకరణలు, పొగడ్తలు, తెగడ్తలు కవిత్వంగా చెలామణి అవడం మొదలుపెట్టాయంటే ఆ జాతి ధ్వంసం అవుతున్నట్టు. నిరలంకారంగా, సూటిగా పలికే ఒక చక్కనిమాటకి శ్రోతల హృదయాలు స్పందిస్తున్నాయంటే ఆ జాతికి మంచిరోజులు వచ్చినట్టు.
c/o కూచిమంచి అగ్రహారం
ఒక్కొక్కప్పుడు మనకు తెలిసిన సాహిత్యమే ఉన్నట్టుండి మరీ సుసంపన్నమైపోతుంది. ఇదిగో c/o కూచిమంచి అగ్రహారం వచ్చిన తరువాత మన కథాసాహిత్యం లాగా.
కాళీపట్నం రామారావు
కాళీపట్నం రామారావు మాష్టారి తొంభైవ పుట్టినరోజు. నవతీ తరణం పేరిట విశాఖ పట్నంలో ఈ రోజొక మహోత్సవం జరగనుంది. ఆగష్టు 29, గిడుగు పుట్టినరోజు , తెలుగుభాషోత్సవంగా జరుపుకుంటున్నట్టే, నవంబరు 9 ని తెలుగు కథానికోత్సవంగా జరుపుకోవలసిన రోజు.
