చంద్రశేఖరరావు

ఎంతో సౌజన్యం, మృదుత్వం కూడుకున్న మనిషి, అతడు మాట్లాడుతుంటే, మల్లెతీగమీంచి పువ్వులేరుతున్నంత కుశలంగానూ, సున్నితంగానూ ఉండింది. ఒక కవినో, రచయితనో చూస్తుంటే, ఇప్పుడే దేవలోకంలోంచి దిగారా అన్నట్టు ఉంటుంది అన్నారొక సాహిత్యాభిమాని ఒకప్పుడు. ఆ రోజు చంద్రశేఖరరావు ని చూస్తే నాకట్లానే అనిపించింది