నిన్న మళ్ళా కృష్ణలీలా తరంగిణి మీద మాట్లాడటానికి కూచున్నప్పుడు గీతగోవింద కావ్యం లో కన్నా కూడా అందులో విస్తృతీ, వైవిధ్యం మరింత ఉన్నాయనిపించింది. ఆ మాటే చెప్పాను అక్కడ. గీతగోవింద కావ్యానికి జీవితకాల ఆరాధకుడిగా నేనా మాటలు చెప్పడం నాకే ఆశ్చర్యమనిపించింది. కానీ ఏం చెయ్యను? కృష్ణలీలాతరంగిణి మహిమను నేనిన్నాళ్ళూ గుర్తించవలసినట్టుగా గుర్తించలేదేమో అనిపించింది.
కళా సాఫల్యం
తెలుగు సాహిత్యచరిత్రను పరిశీలించినా కూడా, తెలుగు నేల రాజకీయంగా అస్థిరత్వం నెలకొన్నప్పుడల్లా యక్షగానం ముందుకొస్తూండటం కనిపిస్తుంది. ఆ అపురూపమైన కళా ప్రక్రియ గురించి తెలుసుకోకపోవడం వల్లా, అందులో రచనలు చేయకపోవడం వల్లా నష్టపోయింది ఆధునిక తెలుగు కవులేనని మరో మారు అర్థమయింది.
త్యాగయ్య ఒక కవి కూడా
సంగీతప్రియులు రాసిన ఈ వ్యాసాలు సాహిత్యప్రియుల్ని కూడా ఆలరింప చేస్తాయి గాని, అన్నిటికన్నా ముందు త్యాగయ్య ఒక కవి అని సాహిత్య ప్రేమికులు కూడా గుర్తుచేసుకోవలసి ఉంటుందని ఈ ప్రత్యేక సంచిక మరీ మరీ హెచ్చరిస్తోంది
