ఏదో నీ ఇంటికి దూరమయ్యేవని అనుకుంటావు కానీ నువ్వు పోగొట్టుకున్నది ఒక ఇల్లు కాదనీ, ఒక ప్రపంచాన్నీ అని నీకు నెమ్మదిగా అర్థమవుతుంది.
పునర్యానం-9
అది మా ఇంట్లో మొదటి కులాంతర వివాహం. మా నాన్నగారికి తెలిస్తే అడ్డుపెట్టి ఉండకపోవచ్చు ఏమో కానీ అంగీకరించకపోయి ఉండవచ్చు కూడా. అందుకని మా అక్క మా నాన్నగారికి చెప్పకుండా తనే దగ్గరుండి ఆ పెళ్లి చేయించింది. ఆ పెళ్లి నేను నా జీవితంలో చూసిన వివాహ వేడుకల్లో అత్యంత ఆదర్శవంతమైన వివాహ వేడుక.
పునర్యానం-7
అటువంటి నిర్మల, నిష్కల్మష కాలాన్ని నా చిన్నప్పుడు మా ఊళ్ళో చూసాను. ఆ తావుల్ని ఎన్ని వీలైతే అన్నిట్ని పునర్యానం మొదటి అధ్యాయంలో కవితలుగా మార్చడానికి ప్రయత్నించాను.
