పునర్యానం-34

ఈ అపరిశుభ్రతకి గల కారణాల్ని విశ్లేషించడం మొదలుపెడితే, ఒక సాంఘిక-రాజకీయ వ్యవస్థగా మనం ఎంత దిగజారుతూ ఉన్నామో, నానాటికీ ఎంత అసమర్థంగా తయారవుతున్నామో అదంతా వివరించవలసి ఉంటుంది.

పునర్యానం-33

నీ కట్టెదుట విధ్వసం సంభవిస్తున్నప్పుడు అది నీ ఆత్మలో విధ్వంసంగా పరిణమించాలి. మనిషిలోనో, భగవంతుడిలోనో నీ నమ్మకం కూకటివేళ్ళు తెగిపోయేటంతగా నువ్వు చలించిపోవాలి. ఏమి చేసి నిన్ను నువ్వు నిలబెట్టుకోగలవా, నీ ఆత్మని కాపాడుకోగలవా అని కొట్టుకుపోవాలి.