నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మరొక రెండు కవితలు, నా ఇంగ్లిషు అనువాదంతో.
స్వప్నబద్ధ
నిర్వికల్పసంగీతంలోంచి కొన్ని కవితలు ఇంగ్లిషు చేద్దామనిపించింది. ఇది 43 ఏళ్ళ కింద రాసిన కవిత. మళ్ళా చదివితే ఫ్రెష్ గానే అనిపించింది. అందుకని ఇలా ఇంగ్లిషు చేసాను, మీతో పంచుకోడానికి.
పునర్యానం-60
అన్నం నుంచి ఆనందం దాకా ఒక చక్రమనీ, ఆనందలోకానికి చేరుకున్నాక నువ్వు తిరిగిమళ్ళా అన్నమయకోశంవైపు దిగి రావలసి ఉంటుందనీ ఋషి అంటున్నాడు. అంతేకాదు, ఆ స్థితికి చేరుకున్నాక 'అన్నం న నింద్యాత్' (అన్నాన్ని నిందించకండి), 'అన్నం బహు కుర్వీత'(అన్నాన్ని విరివిగా అందించండి) అంటున్నాడు.
