పునర్యానం-23

చరిత్ర, తిరుగుబాట్లు, సాహిత్యం పక్కనపెట్టి చూసినా, భూషణం గారు గొప్ప ప్రేమైక మానవుడు. అటువంటి మనిషిని మనం ఒక్కసారి కలుసుకున్నా మన హృదయాల మీద అతని ముద్ర పచ్చబొట్టు పొడిచినట్టుగా దిగబడిపోతుంది.

పునర్యానం-22

కనీసం నువ్వున్న చోటనే, నీ పరిథిలోనే, ఎవరితోనూ సంఘర్షించనక్కర్లేకుండానే, మరొక మనిషికోసం బతకవచ్చు, అతడికి ప్రాణం పోయవచ్చు. చాలాసార్లు మనం ఈ చిన్నపాటి కష్టం పడటానికి బద్ధకించి చాలా పెద్ద గొంతుతో నోరారా అరుస్తుంటాం.

పునర్యానం -17

ఆ తర్వాత మూడేళ్ళ పాటు నా రాజమండ్రి జీవితాన్ని ఆ పుస్తకం వెలిగించింది. ఒక మనిషికి ఒక పుస్తకం తోడుగా ఉండటమనేది సాధారణంగా మనం మతగ్రంథాల విషయంలోనే చూస్తాం. కాని అరుదుగా సాహిత్య గ్రంథాలు కూడా అటువంటి చోటు సంపాదించుకోగలవని ఆగమగీతి నా జీవితంలో ప్రవేశించాకే అర్థమయింది.