పునర్యానం-47

బహుశా ఆ కిటికీ లేకపోయుంటే నేను ఆ ఇంట్లో అన్నేళ్ళు ఉండగలిగి ఉండేవాణ్ణి కానేమో. ఈ ఊళ్ళోనూ ఉండేవాణ్ణి కానేమో. కనకనే, ఆ కిటికీ లేకపోతే నాకీ నగరం కూడా లేదని రాసుకున్నాను.

పునర్యానం-46

ఒక కిటికీనో లేదా ఇంటిముంగట కొబ్బరి చెట్టో, వేపచెట్టో లేదా ఇంటి పెరట్లో పడే వెన్నెలనో లేదా ఆ ఇంటి మేడమీదకి ఎక్కే మెట్లమీద మధ్యాహ్నాల వేళ చిక్కగా పరుచుకునే చెట్లనీడలో- ఏవో ఒకటి ఆ ఇంటిని ఆత్మీయంగా మారుస్తాయి.

పునర్యానం-45

కానీ ఏ రచయితైనా ముందు తన కోసం తన రాసుకుంటాడు. తనలోని ఒక శ్రోతను ఉద్దేశించి తను చెప్పదలుచుకున్నది చెప్పుకుంటాడు. తనలోని శ్రోత కనుమరుగవుతూ బయట శ్రోతలు రావటం ఏ రచయితకీ, ఏ రచనకీ ఆరోగ్యకరం కాదు.