ఇప్పుడు ఈ దేశ స్ఫూర్తిని రాజకీయనాయకులు మంట కలుపుతున్న సమయంలో, ఇదిగో, ఇటువంటి రచయిత్రులు, అనువాదకులు, ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఈ దేశప్రజల మాటలు కావనీ, ఈ దేశ ప్రజలు సరిహద్దుల్ని కోరుకోవడం లేదనీ, సరిహద్దుల్ని దాటిన సాంగత్యాన్ని కోరుకుంటున్నారనీ ఎలుగెత్తి చాటుతున్నారు.
