ఆ విధంగా దక్షిణభారతసాహిత్యానికి వేములవాడ ఇచ్చిన ఉపాదానం అద్వితీయమైంది. ప్రపంచ సాహిత్యచరిత్రల్లోనే ఇటువంటి గణనీయమైన పరివర్తనకు కారణమైన నగరాల్ని వేళ్ళమీద మాత్రమే లెక్కించగలుగుతాం.
బసవపురాణం-10
బసవపురాణాన్ని పరిచయం చేస్తూ వచ్చిన ప్రసంగాల్లో పదవ ప్రసంగం. చివరి ప్రసంగం. తెలుగు కవిత్వాన్ని ప్రజలకు సన్నిహితంగా తీసుకురావడానికి సోమన ఎటువంటి కావ్యశైలిని నిర్మించుకున్నాడో ఆ విశేషాల్ని వివరించడానికి చేసిన ప్రయత్నం.' ఉరుతర గద్యపద్యోక్తులకంటే సరసమై పరగెడు జానుతెనుగు'లో సోమన బసవపురాణాన్ని ఎలా నిర్మించాడో కొన్ని ఉదాహరణలిస్తూ చేసిన ప్రసంగం.
మహాకవిత్వదీక్షావిధి
కవులు, ముఖ్యంగా కొత్త తరహా కవిత్వం రాసేవారు, తమ కవిత్వ కళని నిర్వచించుకుంటూ రాసే కవితలు ప్రపంచమంతా కనిపిస్తాయి. ఇంగ్లీషులోనూ, పాశ్చాత్యప్రపంచంలోనూ అటువంటి కవితల్ని ars poetica కవితలని పిలుచుకోడం పరిపాటి
